మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 11, 2020 , 01:02:15

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ హత్య

అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ హత్య
  • హన్మకొండలో కిడ్నాప్‌.. భూపాలపల్లి రాంపూర్‌ అడవుల్లో హతం

వరంగల్‌ క్రైం: మూడురోజుల క్రితం అదృశ్యమైన ఖమ్మం అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌ మోకు ఆనంద్‌రెడ్డి దారుణ హత్య కు గురయ్యారు. తొలుత కిడ్నాప్‌ అనుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. ప్రదీప్‌రెడ్డి అనే వ్యక్తి హత్య చేశాడని, అందుకు తామే సాక్ష్యమని ఇద్దరు వ్యక్తులు మంగళవారం పోలీసులకు లొంగిపోయారు. జనగామ జిల్లా ఓబుల్‌ కేశవపూర్‌కు చెం దిన ఆనంద్‌రెడ్డి ఖమ్మంలో అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. గతంలో వరంగల్‌లో పని చేస్తున్న సమయంలో ఆయనకు వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరానికి చెందిన ప్రదీప్‌రెడ్డితో  ఆర్థిక లావాదేవీలు కొనసాగాయి. ప్రదీప్‌రెడ్డి డబ్బులు ఇవ్వాల్సి ఉండటంతో ఈనెల 6న  ఆనంద్‌రెడ్డి ఖమ్మం నుంచి హన్మకొండకు వచ్చారు. ఏడో తేదీన హన్మకొండ అశోక హోటల్‌లో ప్రదీప్‌రెడ్డిని కలిసి అ ప్పువిషయం మాట్లాడారు. తాను నగదు ఇవ్వలేనని భూపాలపల్లిలో ఉన్న తన స్థలాన్ని ఇస్తానని చెప్పి ఆనంద్‌రెడ్డిని అక్కడికి తీసుకువెళ్లాడు. ఏడో తేదీ మధ్యాహ్నం 2 గంటల త ర్వాత ఆనంద్‌రెడ్డి ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కావడంతో హన్మకొండ పొలీస్‌స్టేషన్‌లో ఆయన తమ్ముడు శివకుమార్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆనంద్‌రెడ్డి జాడకోసం ప్రయత్నించారు. ఆనంద్‌రెడ్డిని తీసుకెళ్లిన వాహనం హైదరాబాద్‌లోని అల్వాల్‌ ప్రాంతంలో ప్రత్యక్షం కావడం.. ప్రదీప్‌రెడ్డి, ఆయన కారు డ్రైవర్‌ సాగర్‌ ఫోన్లు పనిచేయకపోవడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సాయంత్రం ప్రదీప్‌రెడ్డి కారు డ్రైవర్‌ సాగర్‌తోపాటు ఆ యన అనుచరుడు ప్రవీణ్‌రెడ్డి హన్మకొండ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయా రు. ఆనంద్‌రెడ్డి ని భూపాలపల్లి అడవిలో ప్రదీప్‌రెడ్డి హత్యచేశాడని, అందుకు తామే సాక్షులమని తెలిపారు. సదరు వ్యక్తులను వెంటబెట్టుకొని హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, సీఐలు దయాకర్‌, వాసుదేవరావు నేతృత్వంలోని పోలీసు బృందం భూపాలపల్లిలోని రాంపూర్‌ అడవుల్లో గాలింపు చర్యలు చేపట్టింది. హత్య జరిగిన ఆనవాళ్లను పోలీసు బృందం గుర్తించింది. కాగా అర్ధరాత్రి వరకు మృతదేహం ఆచూకీ లభించలేదు. logo
>>>>>>