మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 06, 2020 , 09:13:40

నేటినుంచి ఆర్డీఎస్‌కు నీరు

నేటినుంచి ఆర్డీఎస్‌కు నీరు

అయిజ: రాజోళి బండ డైవర్షన్‌ స్కీం(ఆర్డీఎస్‌) పరిధిలోని 20 వేల ఎకరాల ఆయకట్టును కాపాడేందుకు తుంగభద్ర డ్యామ్‌ నుంచి 1.90 టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం తుంగభద్ర బోర్డును కోరింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శికి నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు గురువారం లేఖ రాశారు. 2019-20 సంవత్సరానికి సంబంధించి తుంగభద్ర డ్యామ్‌ నుంచి ఆర్డీఎస్‌ నీటి వాటా కింద 5.435 టీఎంసీలు ఇచ్చేందుకు గత నవంబర్‌లో బోర్డు నిర్ణయించింది. అయితే.. తుంగభద్ర నదిలో ప్రస్తుతం ప్రవాహం లేనందున ఆర్డీఎస్‌ ఆయకట్టుకు సాగునీరు, అయిజ, వడ్డేపల్లి, రాజోళి, మానవపాడు, ఉండవెళ్లి, అలంపూర్‌ మండలాల్లో తాగు నీటికోసం చెరువులు నింపేందుకు 1.90 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కోరారు. ఈనెల 17 వరకు టీబీ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయాలని బోర్డుకు పంపిన లేఖలో కోరినట్టు ఆర్డీఎస్‌ ఈఈ శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం ఉదయం నుంచి టీబీ డ్యామ్‌ నుంచి నీటిని విడుదల చేయనున్నట్టు టీబీ డ్యామ్‌ సెక్షన్‌ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు.


logo
>>>>>>