మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 04, 2020 , 09:18:31

ఇంటర్‌ విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తామున్నామంటూ భరోసా

ఇంటర్‌ విద్యార్థులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. తామున్నామంటూ భరోసా

హైదరాబాద్‌ : ఇంటర్‌ విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఈ ఉదయం స్థానిక బృంగి కళాశాల, సిద్దార్థ కళాశాల పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న విద్యార్థులను కలిశారు. పరీక్ష రాసేందుకు వెళ్తున్న పలువురి విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావొద్దని తామున్నామంటూ ధైర్యం చెప్పారు. పరీక్షలు బాగా రాయల్సిందిగా సూచించారు.
logo