గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 15, 2020 , 01:11:06

సీఎం పుట్టిన రోజున 66 వేల మొక్కలు నాటుదాం

 సీఎం పుట్టిన రోజున 66 వేల మొక్కలు నాటుదాం
  • పౌరసరఫరాల సంస్థమారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు చైర్మన్‌
  • మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ 66వ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రవ్యాప్తంగా 66 వేల మొక్కలునాటాలని పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. పౌరసరఫరాలశాఖకు చెందిన 170 గోదాముల్లో ఉద్యోగులందరూ మొక్కలు నాటాలని, రాష్ట్రంలోని ప్రతి రైస్‌ మిల్లులో, ప్రతి పెట్రో ల్‌ బంకుల్లో, ఎల్‌పీజీ గోదాముల్లో కనీసం ఐదు మొక్కలకు తక్కు వ కాకుండా నాటేలా కార్యాచరణ రూపొందించుకోవాలని అధికారులకు సూచించారు. ఎల్పీజీ డీలర్లు ప్రతిఇంటికి సిలిండర్‌ డెలివరీతోపాటు ఒక మొక్కను కూడా అందించాలని కోరారు.


logo