గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 08, 2020 , 01:18:21

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులతో సత్వరన్యాయం

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులతో సత్వరన్యాయం
  • ఆర్నెళ్లలో ఐదుగురికి మరణశిక్ష
  • మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు సత్వరన్యాయం చేస్తున్నాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాష్ట్రం లో చిన్నారులు, మహిళలపై జరిగిన మూడు దారుణ ఘటనల్లో ఆరునెలల వ్యవధిలోనే తీర్పులు వెలువరించాయని చెప్పారు. ‘ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు ఐదుగురు నిందితులకు మరణశిక్ష విధించి, బాధితులకు సత్వరన్యాయం చేశాయి’ అంటూ ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. 


పోలీసులకు హోంమంత్రి అభినందన

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కేసుల్లో వేగంగా దర్యాప్తు జరిపి నిందితులకు శిక్షపడేలా చేసిన పోలీసులను హోంమంత్రి మహమూద్‌ అలీ అభినందించారు. హాజీపూర్‌ వరుస హత్యల కేసులో రాచకొండ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌, చిన్నారిపై అత్యాచారం కేసులో వరంగల్‌ సీపీ రవీందర్‌ పనితీరును హోంమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ఘటనల్లో పోలీసుల సమయస్ఫూర్తి, దర్యాప్తు ప్రశంసనీయమని కొనియాడారు. తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నారని హోంమంత్రి పేర్కొన్నారు.


logo