శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 31, 2020 , 01:36:37

గిరిజనుల విద్యాప్రగతికి కృషి

గిరిజనుల విద్యాప్రగతికి కృషి
  • పోడు భూముల సమస్య సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: మంత్రి సత్యవతి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: గిరిజనుల సామాజిక, ఆర్థిక, విద్యాప్రగతికి కేసీఆర్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సంక్షేమభవన్‌లో మంత్రి అధ్యక్షతన ఆరో గిరిజన సలహామండలి (ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలు, వాటి పరిష్కారాలపై గిరిజన ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించారు. గిరిజన సంక్షేమశాఖ రూపొందించిన మేడారం జాతర ఆహ్వానపత్రికలను సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి అందజేసి ఆహ్వానించారు. సమావేశం అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూపోడు భూముల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారమయ్యేలా చూడాలని నిర్ణయించినట్టు తెలిపారు. సమావేశంలో ఎంపీ సోయంబాబురావు, ఎమ్మెల్యేలు ఆస్రం సక్కు, శంకర్‌నాయక్, హరిప్రియనాయక్, సీతక్క, రాములునాయక్, రేగ కాంతారావు, రేఖనాయక్, రవీంద్రకుమార్, రాథోడ్ బాపురావు, పోదెం వీరయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్‌మిశ్రా పాల్గొన్నారు.

హనీ ట్విగ్స్ విడుదల

గిరిజన సంక్షేమశాఖ గిరి బ్రాండ్ పేరుతో తయారుచేసిన తేనె ప్యాకెట్లను (హనీ ట్విగ్స్) ను మంత్రి సత్యవతి రాథోడ్ గురువారం విడుదల చేశారు. వీటిని గిరిజన గురుకులాలు, ఆశ్ర మ పాఠశాలల విద్యార్థులకు అందించాలని ని ర్ణయించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి బెనహర్ మహేశ్ దత్ ఎ క్కా, కమిషనర్ క్రిస్టినా ఝడ్ చోంగ్తూ పాల్గొన్నారు.


logo