శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Jan 28, 2020 , 01:22:14

ఆడదూడల సంతానోత్పత్తికి నిధులివ్వాలి

ఆడదూడల సంతానోత్పత్తికి నిధులివ్వాలి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఆడదూడల సంతానోత్పత్తికి విడదీసిన వీర్యాన్ని  కొనుగోలుచేసి రైతులకు సబ్సిడీపై అందజేసేందుకు బడ్జెట్‌లో అదనంగా రూ.కోటి నిధులు కేటాయించాలని రాష్ట్ర పశుగణాభివృద్ధి సం స్థల చైర్మన్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కోరా రు. సోమవారం కూకట్‌పల్లిలో వినోద్‌కుమార్‌తో పశుగణాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రావుతోపాటు తొమ్మిది ఉమ్మడి జిల్లాల చైర్మన్లు సమావేశమయ్యారు. ఆవులు, బర్రెలకు కృత్రిమ గర్భధారణ ద్వారా కేవలం ఆడదూడలు పుట్టేలా కొత్త పద్ధతులు అందుబాటులోకి వచ్చాయని, తద్వారా పాల ఉత్పత్తితోపాటు పశుగణాభివృద్ధికి అస్కారం కలుగుతుందని చైర్మన్లు వివరించారు. పశువుల కృత్రిమ గర్భధారణలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో ఉన్నదని రాజేశ్వరరావు తెలిపారు. చైర్మన్ల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన వినోద్‌కుమార్‌.. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి నిధులు మంజూరుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. వినోద్‌కుమార్‌ను కలిసినవారిలో ఉమ్మడి జిల్లాల చైర్మన్లు పట్లోళ్ల నారాయణరెడ్డి (రంగారెడ్డి), టీ చక్రపాణి (నిజామాబాద్‌), ప్రభాకర్‌రెడ్డి (వరంగల్‌), కిషన్‌రెడ్డి (మెదక్‌), పిచ్చిరెడ్డి (నల్లగొండ), గోవర్ధన్‌యాదవ్‌ (ఆదిలాబాద్‌), నాగేశ్వరరావు (ఖమ్మం) ఉన్నారు.  


logo