శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jan 26, 2020 , 01:41:54

ఇక పరిపాలనపైనే దృష్టి

ఇక పరిపాలనపైనే దృష్టి

కీలక బిల్లులపై త్వరగా నిర్ణయాలు.. హామీల అమలుపై ప్రభుత్వం గురి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ప్రధానమైన ఎన్నికలన్నీ పూర్తవడంతో ప్రభు త్వం ఇక పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టనున్నది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం పం చాయతీ ఎన్నికలు, పార్లమెంట్‌ ఎన్నికలు, ఆపై జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలు వరుసగా వచ్చాయి. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు కూడా పూర్తవడంతో ఎలాంటి అడ్డంకులు లేకుండా పరిపాలన ముందుకుసాగనున్నది. కీలక బిల్లులపై చకచకా నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఎన్నికల మ్యానిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించనున్నది.


ప్రచారం చేయకుండానే..

మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కే తారకరామారావు ఎక్కడా ప్రచారం చేయకుండానే గులా బీ దళాలకు అఖండ విజయాన్ని అందించారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్‌ ఎన్నికల్లోనూ ప్రచారం నిర్వహించారు. కానీ మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అందుకు భిన్నంగా వ్యవహరించి తమ విలక్షణతను చాటుకొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రచార కార్యక్రమాలను నిత్యం పర్యవేక్షించడం, నాయకులకు తగిన సలహాలు, సూచనలు, ఆదేశాలిస్తూ పార్టీ అద్భుత విజయం సాధించడంలో విజయవంతమయ్యారు. మిగిలిన రాష్ట్ర మంత్రులు కూడా తమ నియోజకవర్గాలు, జిల్లాల్లో మాత్రమే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారీ బహిరంగసభలు, సమావేశాలు లేకుండానే ప్రచారం చేయాలని, ఇంటింటి ప్రచారానికి ఎక్కువ ప్రధాన్యమివ్వాలని సీఎం కేసీఆర్‌ చేసిన సూచనలకు అనుగుణంగా పార్టీ నాయకులు వ్యవహరించారు. 


ఫలితాన్నిచ్చిన వికేంద్రీకరణ

మున్సిపల్‌ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ ఎమ్మెల్యేలకే పూర్తిబాధ్యతలు అప్పగించడం అద్భుత ఫలితాన్నిచ్చింది. అభ్యర్థుల ఎంపిక, ప్రచా రం, గెలుపు బాధ్యతలన్నీ ఎమ్మెల్యేలే చూసుకోవాలని సీఎం కేసీఆర్‌ ఈ నెల మొదటివా రం తెలంగాణభవన్‌లో నిర్వహించిన సమావేశంలో స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జయాపజయాలకు పూర్తిగా ఎమ్మెల్యేలే బాధ్య త వహించాలని తేల్చిచెప్పడంతో వారంతా తీవ్రంగా శ్రమించారు. 


కేసీఆర్‌ నాయకత్వం మరింత బలోపేతం 

టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా  

మున్సిపల్‌ ఎన్నిక ల్లో తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని మరింత బలోపేతంచేశారని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు అన్నా రు. శనివారం ఆయన తెలంగాణభవన్‌ లో మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అఖండ విజ యం సాధించడంపై హర్షం వ్యక్తం చేశా రు. ఇంతటి ఘనవిజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞలు తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు అచంచలమైన విశ్వాసం ఉన్నదని, అందుకే ఏ ఎన్నిక అయినా టీఆర్‌నే గెలిపిస్తున్నారని అన్నారు. దేశంలో ఎక్కడాలేనంత గొప్ప అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ను మరోసారి విజయపథంలో నడిపిన పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ అద్భుత ఫలితాలను సాధిస్తున్నదని అన్నారు.


logo