గురువారం 04 జూన్ 2020
Telangana - Jan 14, 2020 , 02:36:34

రైల్వేలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డులు

రైల్వేలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌' అవార్డులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విధి నిర్వహణలో ఎంతో అప్రమత్తతతో వ్యవహరించిన 14 మంది రైల్వే ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్‌ మాల్యా ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మంత్‌' భద్రతా అవార్డులను ప్రదానం చేశారు. సోమవారం ఆయన సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి రైళ్లలో సమయపాలనను, రవాణాను మెరుగుపరిచేందుకు సాంకేతిక అధ్యయనం చేయాలని ఆదేశించారు. సమీక్షలో సీఎస్సార్‌ ఉన్నతాధికారులు బీబీ సింగ్‌, అమిత్‌ గోయల్‌, సంజీవ్‌ అగర్వాల్‌, కేవీ శివప్రసాద్‌ పాల్గొన్నారు.


logo