సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 20:59:14

200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

200 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

ఖమ్మం :  అక్రమంగా వాహనంలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 200 క్వింటాల రేషన్ బియ్యాన్ని ఖమ్మం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఖమ్మం నగరంలోని ప్రకాశ్‌నగర్‌లో పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేసి లారీలో లోడు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు సిబ్బందితోపాటు వన్‌టౌన్, త్రీటౌన్ పోలీసులతో కలిసి దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ రాయల రాము అదుపులోకి తీసుకొని బియ్యాన్ని  త్రీటౌన్  పోలీసు స్టేషన్‌కు తరలించారు.

నమ్మషక్యంనగరంలోని శుక్రవారపేటకు చెందిన  సరిగున్ల కృష్ణ బియ్యం అక్రమ దందాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీ ఉన్నట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ తెలిపారు. బియ్యాన్ని రేషన్ షాపుల నుంచి తక్కువ ధరకు కోనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సీఐ వెంకట్ స్వామి, వన్ టౌన్  ఎస్‌ఐ వెంకన్న, త్రీటౌన్ ఎస్ఐ శ్రీనివాస్ ఉన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.