శుక్రవారం 07 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:20:19

కల్యాణలక్ష్మి అమలుకు 200.23 కోట్లు

కల్యాణలక్ష్మి అమలుకు 200.23 కోట్లు

  • ఎస్సీ అభివృద్ధిశాఖ ద్వారా చెల్లింపునకు ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రం లో కల్యాణలక్ష్మి పథకం అమలుకు ప్రభు త్వం రూ.200.23 కోట్లు విడుదలచేసింది. దళిత కుటుంబాలకు చెందిన యువతుల పెండ్లి కోసం ఈ నిధుల నుంచి చెల్లింపులు జరుపాలని ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్‌ పీ కరుణాకర్‌ శనివారం అన్ని జిల్లాల ఆర్డీవోలు, ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కల్యాణలక్ష్మి పథ కం కోసం 10 వేల దరఖాస్తులు వచ్చాయ ని తెలిపారు. అర్హులైనవారికి రూ. 1,00,116 చొప్పున ఆర్థిక చేయూత అందించనున్నామని కరుణాకర్‌ పేర్కొన్నారు. ప్రస్తుత అవసరానికి మించి ప్రభుత్వం రూ.100 కోట్లు అదనంగా నిధులను సమకూర్చిందని చెప్పారు.  logo