బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:05

కరోనా పరీక్షలు 20 లక్షలు

కరోనా పరీక్షలు 20 లక్షలు

  • ప్రతిరోజు 60 వేల టెస్టులు
  • రికవరీ 78%, మరణాలు 1%లోపే
  • గురువారం 2,426 కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు శరవేగంగా కొనసాగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం ప్రతిరోజు 60 వేలకు పైగా టెస్టులు నిర్వహిస్తున్నది. దీంతో గురువారం నాటికి మొత్తం పరీక్షల సంఖ్య 20,16,461కు చేరినట్టు శుక్రవారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్పటివరకు ప్రతి 10 లక్షల జనాభాలో 54,313 మందికి నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. మొత్తం 1.52 లక్షల మందికి వైరస్‌ సోకగా, 1.19 లక్షలమంది కోలుకున్నారు. సకాలంలో సరైన చికిత్స అందిస్తుండటంతో రికవరీ రేటు 78 శాతానికి చేరుకున్నది. ప్రభుత్వ పకడ్బందీ చర్యలతో మరణాల రేటు ఒక శాతంలోపే (0.61%) నమోదవుతున్నది. మరో 32 వేల మంది ఇండ్లు, దవాఖానలలో చికిత్స పొందుతున్నారు. గురువారం కొత్తగా 2,426 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీలోనే 338 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 216, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 172, నల్లగొండలో 164, కరీంనగర్‌లో 129, వరంగల్‌ అర్బన్‌లో 108, ఖమ్మంలో 98, సంగారెడ్డిలో 97, నిజామాబాద్‌లో 89, సిద్దిపేటలో 87, సూర్యాపేటలో 78, మహబూబాబాద్‌లో 76, భద్రాద్రి కొత్తగూడెంలో 67, జగిత్యాలలో 62, మంచిర్యాలలో 57, పెద్దపల్లిలో 56, కామారెడ్డిలో 54, నాగర్‌కర్నూల్‌లో 50, మహబూబ్‌నగర్‌లో 46, యాదాద్రి భువనగిరిలో 43, మెదక్‌లో 42, రాజన్న సిరిసిల్లలో 41, వనపర్తిలో 38, జనగామలో 33, నిర్మల్‌, జోగుళాంబ గద్వాలలో 32 చొప్పున, ఆదిలాబాద్‌లో 25, జయశంకర్‌ భూపాలపల్లిలో 22, వరంగల్‌ రూరల్‌లో 18, ములుగులో 16, కుమ్రంభీం ఆసిఫాబాద్‌లో 15, నారాయణపేటలో 14, వికారాబాద్‌లో 11 కేసులు వెలుగుచూశాయి. కరోనాకుతోడు ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో 13 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 940కి చేరుకున్నది.

కొవాగ్జిన్‌తో సత్ఫలితాలు

  • జంతువులపై రెండో డోస్‌ ప్రయోగం

జంతువులపై ‘కొవాగ్జిన్‌' రెండో డోస్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని భారత్‌ బయోటెక్‌ సంస్థ తెలిపింది. సంస్థ ఇటీవలే 20 కోతులపై ప్ర యోగాలుచేసింది. 5 కోతు ల చొప్పున 4 బృందాలుగా విభజించింది. ఒక బృందానికి కొవాగ్జిన్‌ టీకా ఇవ్వగా, మిగతా బృందాలకు 3 ఇతర వ్యాక్సిన్లువేశారు. 14 రోజుల తర్వాత పరిశీలించగా కొవాగ్జిన్‌ వేసిన కోతుల ముక్కు, గొంతు, ఊపిరితిత్తులలో కొవిడ్‌- 19ను ఎదుర్కొనే ప్రతిరక్షకాలు గణనీయంగా ఉత్పత్తి అయ్యాయని సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలో ఎలాంటి దుష్ఫ్రభావాలు కనిపించలేదని తెలిపింది.


logo