శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 07:47:01

గోయల్‌వాడ నదిలో కొట్టుకుపోయిన 2 ఇసుక ట్రాక్టర్లు

గోయల్‌వాడ నదిలో కొట్టుకుపోయిన 2 ఇసుక ట్రాక్టర్లు

పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోయల్‌వాడ నదిలో 2 ఇసుక ట్రాక్టర్లు ట్రాక్టర్లు నీటిలో కొట్టుకుపోయాయి. అక్రమంగా ఇసుక తరలించేందుకు నదిలోకి 6 ట్రాక్టర్లు వెళ్లి కూలీలతో ఇసుక లోడ్‌ చేస్తుండగా నదిలో ఒక్కసారి వరద ప్రవాహం పెరిగింది. దీంతో నాలుగు ట్రాక్టర్లను వరద ప్రవాహంలోనే డ్రైవర్లు ఒడ్డుకు చేర్చగా రెండు ట్రాక్టర్లు ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. ఇసుక లోడ్‌ చేసేందుకు వెళ్లిన 30 మంది కూలీలు కష్టంమీద బయటకు వచ్చి ప్రాణాలు కాపాడుకున్నారు. సమాచారం అందకున్న అధికారులు ఘటనపై ఆరా తీశారు. గోయల్‌వాడ నది పరిసర ప్రాంతాల్లోకి ఎవ్వరూ వెల్లకుండా అప్రమత్తం చేశారు.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.