గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 24, 2020 , 02:21:20

ఒకేరోజు 2 లక్షల మొక్కలు

ఒకేరోజు 2 లక్షల మొక్కలు

  • హరితహారం, వృక్షారోపన్‌ అభియాన్‌ ప్రారంభం
  • సింగరేణి సీఎండీ శ్రీధర్‌ వెల్లడి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంతోపాటు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చేపట్టిన వృక్షారోపన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ గురువారం హైదరాబాద్‌లోని సింగరేణిభవన్‌లో మొక్కనాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌ మాట్లాడుతూ.. హరితహారం, వృక్షారోపన్‌ అభియాన్‌ కింద సింగరేణి పరిధిలో ఈ ఏడాది 35.47 లక్షల మొక్కలు నాటుతున్నట్లు ప్రకటించారు. మొత్తం 804 హెక్టార్లలో వీటిని నాటుతామని వెల్లడించారు. అందులో భాగంగా ఇప్పటికే 11 లక్షల మొక్కలను నాటినట్లు తెలిపారు. సింగరేణి సమీప గ్రామాల ప్రజలకు ఈ యేడు 2.5 లక్షల పండ్ల మొక్కలను పంపిణీ చేస్తున్నామన్నారు. కాగా గురువారం ఒక్కరోజే 2 లక్షల మొక్కలను నాటినట్లు ఆయన పేర్కొన్నారు. 

ఢిల్లీలో మంత్రులు..

కాగా న్యూఢిల్లీలో వృక్షారోపన్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి గురువారం ప్రారంభించారు. కోల్‌ ఇండియా చైర్మన్‌, సింగరేణి చైర్మన్లు తమ కంపెనీల్లో మొక్కలు నాటారు. హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌ లో జరిగిన కార్యక్రమంలో ఈడీ జె అల్విన్‌, సలహాదారు డీఎన్‌ ప్రసాద్‌, కే సురేంద్రపాండే, జీఎం రవిశంకర్‌, సీఎంవోఏఐ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ పాల్గొన్నారు. 


logo