శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 26, 2020 , 02:29:53

రాష్ర్టానికి 2 లక్షల యాంటీజెన్‌ కిట్లు

రాష్ర్టానికి 2 లక్షల యాంటీజెన్‌ కిట్లు

  • భారీగా కరోనా నిర్ధారణ పరీక్షలకు సమాయత్తం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరో నా నిర్ధారణ పరీక్షలను మరింతగా పెంచిన ప్రభు త్వం అరగంటలోనే ఫలిత ం ఇచ్చే యాంటీజెన్‌ టెస్టిం గ్‌ కిట్స్‌ను తెప్పిస్తున్నది. అతి త్వరలో మరో 2 లక్షల యాంటీజెన్‌ కిట్లు రాష్ర్టానికి రాబోతున్నాయి. మరో దశలో 3 లక్షల కిట్లను తెప్పించాలనే ఆలోచనలో ఉన్నది. యాంటీజెన్‌ టెస్టుల్లో ఫలితం వెంటనే వస్తుండటంతో పాజిటివ్‌ వ్యక్తులను వెంటనే గుర్తించి, ఐసొలేషన్‌ చేసేందుకు వీలుకలుగుతున్నది. రాష్ట్రంలో ఇప్పటివరకు 80 వేలకుపైగా యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహించినట్టు వైద్యాధికారులు తెలిపారు. జిల్లాల్లో వైరస్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రాథమిక, ఏరియా, జిల్లా దవాఖానల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 15 వేల వరకు నిర్ధారణ పరీక్షలుచేస్తుండగా, రాబోయే రోజుల్లో 25 వేలవరకు పరీక్షలుచేయాలని ప్రభుత్వం భావిస్తున్నది.  logo