ఆదివారం 24 జనవరి 2021
Telangana - Dec 29, 2020 , 13:16:18

ఏసీబీ డీజీగా జే పూర్ణ‌చంద‌ర్‌రావు

ఏసీబీ డీజీగా జే పూర్ణ‌చంద‌ర్‌రావు

హైద‌రాబాద్ : రాష్ర్టంలో ఇద్ద‌రు ఐపీఎస్ అధికారుల‌కు ప‌దోన్న‌తులు ల‌భించాయి. డీజీపీ హోదాలో ప్రింటింగ్‌, స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా ఎం గోపీకృష్ణ నియామ‌కం అయ్యారు. తెలంగాణ స్పెష‌ల్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్(ఎస్పీఎఫ్) డీజీగా గోపీకృష్ణ‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అవినీతి నిరోధ‌క శాఖ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌గా జే పూర్ణ‌చంద‌ర్‌రావును నియ‌మిస్తూ ఉత్త‌ర్వులు జారీ అయ్యాయి. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా పూర్ణ‌చంద‌ర్‌రావుకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. 


logo