నల్లగొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రాజెక్టులోకి 68,263 క్యూసెక్కుల నీరు వస్తున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్ గేట్లను ఎత్తివేశారు. గేట్ల ద్వారా 16,116 క్యూసెక్కుల నీటిని వదులుతుండగా, విద్యుదుత్పత్తి, ఎడమ కాలువ, కుడికాలువ ద్వారా మొత్తం 68,263 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది.
సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు. ప్రస్తుతం 589.60 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 312.0405 టీఎంసీలకుగాను 310.84 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.