ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 16:12:21

పాతబ‌స్తీలో రోడ్డు ప్ర‌మాదాలు.. ఇద్ద‌రు మృతి

పాతబ‌స్తీలో రోడ్డు ప్ర‌మాదాలు.. ఇద్ద‌రు మృతి

హైద‌రాబాద్ : న‌గ‌రంలోని పాతబ‌స్తీలో బుధ‌వారం మ‌ధ్యాహ్నం వేర్వేరు చోట్ల రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. మంగ‌ళ్‌హాట్ సీతారామ్‌బాగ్‌లో పోలీసు గ‌స్తీ వాహ‌నం ఢీకొని హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ అనే బాలుడు మృతి చెందాడు. చాంద్రాయ‌ణ‌గుట్ట‌లో టిప్ప‌ర్ ఢీకొని మూడేళ్ల చిన్నారి మారుయం ప్రాణాలు కోల్పోయింది. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై ఆయా పోలీసు స్టేష‌న్ల ప‌రిధిలోని పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. టిప్ప‌ర్ డ్రైవ‌ర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతుల నివాసాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.


logo