గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 27, 2020 , 09:15:00

రాష్ట్రంలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో గడిచిన 24గంటల్లో కొత్తగా 2,795 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో పాజిటివ్‌ కేసులు 1,14,483కు చేరాయి. తాజాగా 8 మంది వైరస్‌ ప్రభావంతో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 788కి చేరింది. తాజాగా 872 మంది వైరస్‌ నుంచి కోలుకొని డిశ్చారి అయ్యారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 86,095 మంది వైరస్‌ కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 26,700 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 27,600 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. కాగా, బుధవారం ఒకే రోజు 60,386 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని, ఇంకా 1,075 శాంపిల్స్‌ ఫలితాలు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 11,42,480 పరీక్షలు చేశామని చెప్పింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.68శాతంగా ఉండగా దేశంలో 1.84గా ఉందని, అలాగే రికవరీ రేటు 75.2 శాతంగా ఉందని వివరించింది. తాజాగా నమోదైన 2,795 పాజిటివ్‌ కేసుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోనే 449 నిర్ధారణ కాగా.. తర్వాత రంగారెడ్డి జిల్లాలో 168, నల్గొండలో 164, ఖమ్మం 152, కరీంనగర్‌ 136, వరంగల్‌ అర్బన్‌ 132, సిద్దిపేట 113, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 113, నిజామాబాద్‌ 122, మంచిర్యాల 106, మహబూబాబాద్‌ 102 అత్యధికంగా వందకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo