ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 09:05:20

తెలంగాణలో కొత్తగా 2,751 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,751 కరోనా కేసులు

హైదరాబాద్‌ :  తెలంగాణలో గడిచిన 24గంటల్లో 2,751 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,20,166కి చేరింది. తాజాగా వైరస్‌ ప్రభావంతో 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 808కి చేరుకుంది. తాజాగా 1,675 మంది వైరస్‌ నుంచి కోలుకోగా ఇప్పటి వరకు 89,350 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 30,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. 23,049 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని చెప్పింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.67శాతంగా ఉందని, ఇది దేశ సగటు (1.81శాతం) కంటే ఎక్కువని తెలిపింది. అలాగే రాష్ట్రంలో రికవరీ రేటు 74.3శాతంగా ఉందని పేర్కొంది. కొత్తగా 62,300 శాంపిల్స్‌ టెస్టు చేయగా.. ఇప్పటికీ 12,66,643 టెస్టులు చేసినట్లు వివరించింది. ఇంకా 1010 రిపోర్టులు రావాల్సి ఉందని, ఒక మిలియన్‌ జనాభాకు 34,177 పరీక్షలు చేసినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన 2,751 పాజిటివ్‌ కేసుల్లో హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీలో 432, కరీంనగర్‌ 192, రంగారెడ్డి 185, నల్గొండ 147, ఖమ్మం 132, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి 128, నిజామాబాద్‌ 133, సూర్యాపేఏట 111, వరంగల్‌ అర్బన్‌ 101 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.



logo