బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 09:33:35

తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ కరోనా వైరస్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం రెండు వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,381 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 2,021 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్ బారినపడిన వారిలో తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 10 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇప్పటివరకు రాష్ట్రంలో 1,81,627 మంది కరోనా బారినపడగా 1,50,160 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,387 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా  24,592 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. 1080 మంది మృత్యువాతపడ్డారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 57,621 మందికి కరోనా నిర్ధారణ పరీక్ష చేయగా మొత్తం 27,41,836 టెస్టులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 386 కేసులు నమోదయ్యాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
logo