బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Sep 20, 2020 , 09:43:04

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,137 పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్‌ బారినపడిన వారిలో 2,192 మంది చికిత్సకు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,71,306 మంది కరోనా బారినపడగా 1,39,700 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. 30,573 మంది వివిధ దవాఖానల్లో చికిత్స పొందుతుండగా 24,019 మంది హోం ఐసోలేషనల్‌లో ఉన్నారు.

తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 1033 మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో 53,811 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటివరకు 24,88,220 టెస్టులు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా మరణాల రేటు 0.60శాతంగా ఉండగా, రికవరీ రేటు 81.54శాతంగా ఉందని వైద్యారోగ్య శాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 322 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.



logo