శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 10:30:27

సాచ్యురేషన్‌లో 2.10 లక్షల ఎకరాల్లో‌ అడవుల పునరుద్ధరణ

సాచ్యురేషన్‌లో 2.10 లక్షల ఎకరాల్లో‌ అడవుల పునరుద్ధరణ

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని అటవీ బ్లాకుల్లో క్షీణించిన అడవులను సాచ్యురేషన్‌ పద్ధతిలో పునరుద్ధరించాలని అటవీ సంరక్షణ ప్రధానాధికారి (పీసీసీఎఫ్‌) ఆర్‌ శోభ చెప్పారు. అటవీ పునరుద్ధరణపై అరణ్యభవన్‌లో అటవీ సర్కిళ్లు, జిల్లా అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొత్తం 32 లక్షల ఎకరాల్లో అటవీ ప్రాంతాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు ఆమె చెప్పారు. ఇందులో కృత్రిమ పద్ధతి ద్వారా 11 లక్షల ఎకరాలు చేయాలన్నారు. 2020-21గాను 920 బ్లాకుల్లో 2.10 లక్షల ఎకరాల్లో అడవి పునరుద్ధర లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. 


logo