గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Aug 01, 2020 , 09:45:01

తెలంగాణలో కొత్తగా 2,083 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 2,083 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో  కొత్తగా 2083 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 11 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 530 కు చేరుకుంది.  రాష్ట్రంలో ఇప్పటివరకు 64,786 మందికి కరోనా పాజిటవ్‌ నిర్ధారణ కాగా 46,502 మంది కోలుకున్నారని వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన తాజా బులిటిన్‌లో వెల్లడించారు.

మరో 17,754 మంది ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారని తెలిపారు. ఒక్కరోజే 1,114 కరోనా నుంచి కోలుకున్నారని వివరించారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో  578, రంగారెడ్డి జిల్లాలో 228, మేడ్చల్‌ జిల్లాలో 197,  వరంగల్‌ అర్బన్‌లో 134 కొత్తగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo