ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:21

కోలుకున్న 1.58 లక్షల మంది

కోలుకున్న 1.58 లక్షల మంది

హైదరాబాద్‌, నమస్తేతెలంగాణ: రా ష్ట్రంలో కరోనా బాధితులు వేగంగా కోలుకుంటున్నారు.సోమవారందాకా మొత్తం 29.4 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1.89 లక్షలమందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.58 లక్షల మంది కోలుకోగా, 29,477 మంది చికి త్స పొందుతున్నారు. తెలంగాణలో 83.83 శాతానికి చేరుకున్నట్టు మంగళవా రం విడుదలచేసిన బులెటిన్‌ లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్న ది. సోమవారం కొత్తగా 2,072 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. జీహెచ్‌ఎంసీలో 283 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి జిల్లాలో 161, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 160, నల్లగొండలో 139, కరీంనగర్‌ జిల్లాలో 109 మందికి వైరస్‌ సోకింది.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
సోమవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,072
1,89,283
డిశ్చార్జి అయినవారు
2,259
1,58,690
మరణాలు
9
1,116
చికిత్స పొందుతున్నవారు
-
29,477
logo