గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 10:28:05

రాష్ట్రంలో కొత్త‌గా 1986 క‌రోనా కేసులు

రాష్ట్రంలో కొత్త‌గా 1986 క‌రోనా కేసులు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో కొత్త‌గా 1986 పాజిటివ్ కేసులు న‌మోదవ‌గా, 14 మంది మ‌ర‌ణించారు. దీంతో తెలంగాణ‌లో క‌రోనా కేసుల సంఖ్య 62,703కు చేరింది. క‌రోనాతో ఇప్ప‌టివ‌ర‌కు 519 మంది మృతిచెందారు. 

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 586 కేసులు, మేడ్చెల్ జిల్లాలో 207, రంగారెడ్డి జిల్లాలో 205, వరంగ‌ల్ అర్బ‌న్‌లో 123, క‌రీంన‌గ‌ర్‌లో 116, సంగారెడ్డిలో 108, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 61, మెద‌క్‌లో 45, ఖ‌మ్మంలో 41, న‌ల్ల‌గొండలో 36, మంచిర్యాల 35, గ‌ద్వాల 32, నాగ‌ర్‌క‌ర్నూల్‌, వరంగ‌ల్ రూర‌ల్‌లో 30 చొప్పున‌, కొత్త‌గూడె 29, ములుగు 27, పెద్ద‌ప‌ల్లి 26, సిరిసిల్ల 23, జ‌న‌గామ 21, సిద్దిపేట 20, నిజామాబాద్‌లో 19, వ‌న‌ప‌ర్తిలో 18, ఆదిలాబాద్ 16, భువ‌న‌గిరి 12 చొప్పున న‌మోద‌య్యాయి. 


logo