ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 01:11:48

197 మంది జర్నలిస్టులకు సాయం: అల్లం నారాయణ

197 మంది జర్నలిస్టులకు సాయం: అల్లం నారాయణ

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారినపడిన 197 మంది జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించినట్లు తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. వీరిలో 128 మందికి రూ.20 వేల చొప్పున రూ.20.60 లక్షలు, హోం క్వారంటైన్‌లో ఉన్న 69 మందికి రూ.10 వేల చొప్పున రూ. 6.90 లక్షలు అందించామని పేర్కొన్నారు. మొత్తంగా అందరికీ రూ. 32.50 లక్షల ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు. సోమవారం నాటికి కొత్తగా వివిధ జిల్లాలకు చెందిన మరో 29 మంది జర్నలిస్టులకు పాజిటివ్‌ వచ్చిందని, వీరితోపాటు 17 మంది పాత్రికేయులను హోం క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచించారని తెలిపారు. వీరికి కూడా రూ.7.50 లక్షలు మీడియా అకాడమి నుంచి ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు అల్లం నారాయణ ప్రకటించారు.  logo