సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 07, 2020 , 02:46:05

ఒక్కరోజే 1,831 కేసులు

ఒక్కరోజే 1,831 కేసులు

  • జీహెచ్‌ఎంసీలో 1,419 మందికి పాజిటివ్‌
  • 11 మంది మృతి, 2,078 మంది డిశ్చార్జి
  • రాష్ట్రంలో 25 వేలు దాటిన కరోనా కేసులు
  • ఇప్పటివరకు చేసిన పరీక్షలు 1,22,218 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరో నా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం ఒక్కరోజే 1,831 కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ లో 1,419 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ట్టు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో 160, మేడ్చల్‌మల్కాజిగిరి 117, ఖమ్మం 21, మెదక్‌, మంచిర్యాల 20 చొప్పున, మహబూబ్‌నగర్‌, నల్లగొండ, వరంగల్‌అర్బన్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి జిల్లాల్లో 9 చొప్పున, వికారాబాద్‌ 7, సూర్యాపేట 6, కరీంనగర్‌ 5, జగిత్యాల 4, సంగారెడ్డి 3, మహబూబాబా ద్‌, యాదాద్రి భువనగిరి, నారాయణపేట, జోగుళాంబగద్వాల జిల్లాల్లో 1 కేసు చొప్పున వెలుగుచూశాయి. అటు.. రికార్డుస్థాయిలో ఒకేరోజు 2,078 మంది కోలుకొన్నారు. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాలతో 11 మంది మృతిచెందా రు. మొత్తం మృతుల సంఖ్య 306కు చేరింది. ఒక్కరోజే 6,383 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిపిన పరీక్షల సంఖ్య 1,22,218కు చేరింది. సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిలర్‌ ఒకరు కరోనాతో గాంధీ దవాఖానలో మృతిచెందారని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఓ బాలింత (35) మృతిచెందింది.  

ఖాళీగా సగానికిపైగా బెడ్లు

ప్రభుత్వ కరోనా చికిత్సా కేంద్రాల్లో సగానికిపైగా బెడ్లు ఖాళీగా ఉన్నాయని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గాంధీ, కింగ్‌ కోఠి, ఛాతి, ఫీవర్‌ దవాఖానల్లో కలిపి మొత్తం 2,501 బెడ్లు అందుబాటులో ఉంచినట్టు చెప్పింది. ఇందులో 1,340 పడకలు ఖాళీగా ఉన్నాయని వివరించింది.

ప్రాణాలు కాపాడిన దేవుడు మంత్రి ఈటల

ఫోన్‌చేయగానే స్పందించి చికిత్స అందించేందుకు చొరవ తీసుకున్న మంత్రి ఈటల రాజేందర్‌కు ఓ కరోనా బాధితుడు ధన్యవాదాలు తెలిపారు. ఎండీ రఫీ అనే వ్యక్తికి ఆదివారం శాస్వ తీసుకోవడంలో ఇబ్బంది కలిగింది. ఓ దవాఖానకు వెళ్లినా కరోనా లక్షణాలు ఉన్నాయంటూ చేర్చుకోలేదు. దీంతో ఏంచేయాలో తెలియక, మంత్రి ఈటల నంబర్‌ తెలుసుకొని అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్‌చేశారు. సమస్య తెలుసుకున్న మంత్రి వెంటనే స్పందించి, దవాఖానలో చేర్చుకునేలా చర్యలు తీసుకున్నారు. దీంతో మంత్రి ఈటలకు ఎండీ రఫీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన ప్రాణాలు కాపాడిన దేవుడు అని సంతోషం వ్యక్తంచేశారు.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు      
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,831
25,733  
డిశ్చార్జి అయినవారు
 2,078
14,781
మరణాలు
11306
చికిత్స పొందుతున్నవారు
-10,646


గాంధీలో మంచిగ జూసుకున్నరు


మాది సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం తూర్పుగూడెం. నాకిప్పుడు 85 ఏండ్లు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన. 40 ఏండ్లు  ఆర్‌ఎంపీగా పనిజేసిన. కొన్నేండ్ల సంది హైదరాబాద్‌ గౌలిగూడల కొడుకు దామోదర్‌తాన ఉంటున్న. నేను ఏడికి వోలె. ఎట్లచ్చిందో ఏమో. మొన్నామధ్య పానం సుస్తయితే పరీచ్చలు జేసి కరోనా అని జెప్పిండ్లు. గాంధీ దవాఖానల చేరితే 15 రోజులు మంచిగ జూసుకున్నరు. పొద్దున చాయ్‌, బిస్కెట్లు ఇచ్చిన్రు. నాస్తా పెట్టేది. అరటిపండు, కోడిగుడ్డు ఇచ్చేది. మూడుసార్లు అన్నం పెట్టేది. అన్నం వద్దని చెప్తే రొట్టెలు ఇచ్చేది. యాళ్లకు మందులు ఇచ్చిన్రు. మూడుపూటలా డాక్టర్లు వచ్చి సూసిపోయేది. కంటికి రెప్పలెక్క జూసుకున్నరు. మొన్న మల్లతేపకు పరీచ్చ జేత్తె కరోనా పోయిందన్నరు. ఇంటికి పంపి న్రు. డాక్టర్లు మంచిగ జూసుకోకవోతే ఏమైపోయేటోన్నో ఏమో. ఆళ్లు సల్లగుండాలె.

- సోమ జనార్దన్‌రావు, స్వాతంత్య్ర సమరయోధుడు


logo