బుధవారం 20 జనవరి 2021
Telangana - Oct 26, 2020 , 15:56:38

ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో రూ. 18.67 ల‌క్ష‌లు స్వాధీనం

ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో రూ. 18.67 ల‌క్ష‌లు స్వాధీనం

సిద్దిపేట : సిద్దిపేట‌లో దుబ్బాక బీజేపీ అభ్య‌ర్థి ర‌ఘునంద‌న్ రావు బంధువు ఇంట్లో పోలీసులు, రెవెన్యూ అధికారులు సోమ‌వారం మ‌ధ్యాహ్నం త‌నిఖీలు చేశారు. త‌నిఖీల్లో భాగంగా ఆ ఇంట్లో ఉన్న‌ రూ. 18.67 ల‌క్ష‌ల‌ను పోలీసులు, రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాలు జ‌రిపిన బంధువు ఇంటికి ర‌ఘునంద‌న్ రావు చేరుకున్నారు. ఈ క్ర‌మంలో పోలీసులు, బీజేపీ కార్య‌క‌ర్త‌ల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దుబ్బాక ఉప ఎన్నిక‌కు న‌వంబ‌ర్ 3న పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 10వ తేదీన ఓట్ల‌ను లెక్కించ‌నున్నారు.


logo