బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 16:01:12

తొలిరోజు 18.65 లక్షల మందికి రైతుబంధు సాయం

తొలిరోజు 18.65 లక్షల మందికి రైతుబంధు సాయం

హైదరాబాద్‌ : ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించి పంట సాయం కోసం రైతుబంధు పంపిణీని సోమవారం నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. తొలిరోజు ఎకరం పొలం ఉన్న ప్రతి రైతుల ఖాతాల్లో రూ. 5 వేల చొప్పున జమచేసింది.  సుమారు 18.65 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.559 కోట్లు జమ చేసినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 61.49 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా సీఎం కేసీఆర్‌ ఆదివారం  7,515 కోట్లు విడుదల చేశారు. ఎకరానికి రూ. 5 చొప్పున 1.52 కోట్ల ఎకరాలకు సాయం అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  కరోనా కష్టకాలంలోనూ పంటసాయం అందుతుండటంపై రైతుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo