మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 21:25:29

తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 178 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 178 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య  శాఖ తెలిపింది. దీంతో  రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3472 కి చేరింది. కొత్తగా వచ్చిన కరోనా కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3920 కు చేరింది. ఈరోజు కరోనాతో ఆరుగురు మరణించారు.

కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 143 జీహెచ్‌ఎమ్‌సీలోనే ఉన్నాయి. మిగిలిన కేసుల్లో రంగారెడ్డిలో 15, మేడ్చల్‌లో 10, మహబూబ్‌నగర్‌లో 2, సంగారెడ్డిలో 2,  మెదక్‌లో 2, జగిత్యాల, ఆసిఫాబాద్, సిరిసిల్ల, వరంగల్‌  రూరల్‌‌లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.  

ఇక రాష్ట్రంలో కరోనా చికిత్స తీసుకుని 1742 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 148కు  చేరింది. 


logo