e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home తెలంగాణ నిజామాబాద్‌ చెరువులకు 172 కోట్లు

నిజామాబాద్‌ చెరువులకు 172 కోట్లు

నిజామాబాద్‌ చెరువులకు 172 కోట్లు

హైదరాబాద్‌, జూన్‌ 19 ( నమస్తే తెలంగాణ): ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో పలు చెరువుల అభివృద్ధి, నూతన చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సుమారు రూ.172 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (నీటిపారుదల శాఖ) రజత్‌కుమార్‌ శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్‌ జిల్లాలో మంజీర నదిపై కోటగిరి మండలం కొడిచెర్ల గ్రామం వద్ద చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి రూ.66.68 కోట్లు, సుంకిని వద్ద చెక్‌డ్యామ్‌ నిర్మాణానికి రూ.29.93 కోట్లు కేటాయించారు. వీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టు దిగువన నిర్మించనున్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లోని మూడు చెరువుల అభివృద్ధికి రూ.72.52 కోట్లు కేటాయించింది. చెరువులను పటిష్ఠం చేయడంతోపాటు సామర్థ్యాన్ని పెంచనున్నారు. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్‌ మండలం హాజీపూర్‌లోని మత్తడి వాగు అభివృద్ధికి రూ.2.73 కోట్లు కేటాయిస్తూ పాలనా అనుమతులు మంజూరుచేసింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
నిజామాబాద్‌ చెరువులకు 172 కోట్లు
నిజామాబాద్‌ చెరువులకు 172 కోట్లు
నిజామాబాద్‌ చెరువులకు 172 కోట్లు

ట్రెండింగ్‌

Advertisement