గురువారం 04 జూన్ 2020
Telangana - May 02, 2020 , 22:12:35

రాష్ట్రంలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 17 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 15 కేసులు నమోదు కాగా, రంగారెడ్డి జిల్లా పరిధిలో రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్‌ 19 బాధితుల సంఖ్య 1061కి చేరుకుంది. కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో ఈ రోజు ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటి వరకు 29 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి కోలుకుని 499 మంది బాధితులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 533 మంది బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 


logo