సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 17, 2020 , 19:56:38

ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తా.. 17 మంది గుత్తికోయ‌ల‌కు గాయాలు

ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తా.. 17 మంది గుత్తికోయ‌ల‌కు గాయాలు

జయశంకర్ భూపాలపల్లి : ట‌్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తా ప‌డిన ఘ‌ట‌న‌లో అందులో ప్ర‌యాణిస్తున్న వారిలో 17 మంది వ్య‌క్తులు గాయ‌ప‌డ్డారు. వీరిలో ఏడుగురు వ్య‌క్తులు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న జ‌యశంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా మ‌హాదేవ‌పూర్ మండ‌లం మేడిగ‌డ్డ ప్రాజెక్టు స‌మీపంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మావోయిస్టుల అల‌జ‌డులు ఇటీవ‌ల కాలంలో పెరిగాయి. ఈ నేప‌థ్యంలో అటవీ గ్రామాల వాసుల‌కు పోలీసులు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో భాగంగా కాగారం డీఎస్పీ బోనాల కిష‌న్ పటేల్‌, మ‌హాదేవ‌పూర్ సీఐ అంబ‌టి న‌ర్స‌య్య ఆధ్వ‌ర్యంలో మేడిగ‌డ్డ ప్రాజెక్టు ఆవ‌ర‌ణ‌లో ఉ్న ప‌లిమెల పోలీస్ స్టేష‌న్‌లో మంగ‌ళ‌వారం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి వ‌చ్చిన గుత్తి కోయ‌లు తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. తిరుగు ప్ర‌యాణంలో మూల‌మ‌లుపు వ‌ద్ద ట్రాక్ట‌ర్ అదుపుత‌ప్పి బోల్తాప‌డింది. బాధితుల‌ను మ‌హాదేవ‌పూర్ సామాజిక ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.