హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): 2021-22 విద్యాసంవత్సరానికి మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.17.22 కోట్లు మంజూరుచేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సోమవారం జీవో జారీచేశారు. వయోజన విద్యకు రూ.5.12 కోట్లను మంజూరుచేస్తూ మరో జీవో ఇచ్చారు.