శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 29, 2020 , 02:15:31

కరోనా టెస్టులు 3.79 లక్షలు

కరోనా టెస్టులు 3.79 లక్షలు

  • కొత్తగా 1,610 కేసులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షల ప్రక్రియ వేగంగా కొనసాగుతున్నది. సోమవారం 15,839 టెస్టులు నిర్వహించగా, మొత్తం పరీక్షలు 3,79,081కి చేరుకున్నాయి. ప్రతి 10 లక్షల జనాభాకు 140 మందికి నిర్ధారణ పరీక్షలుచేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుండగా, రాష్ట్రంలో అంతకుమించి పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ మంగళవారం విడుదలచేసిన సమగ్ర బులెటిన్‌ స్పష్టంచేసింది. ఇప్పటివరకు 57,142 కరోనా కేసులు నమోదవగా, 84శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవని, వారిని హోంఐసొలేషన్‌లో ఉంచి వైద్యసేవలు అందిస్తున్నట్టు తెలిపింది. రాష్ట్రంలో సోమవారం 1,610 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జీహెచ్‌ఎంసీలోనే 531 కేసులు నమోదయ్యాయి. 

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
సోమవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
1,610
57,142  
డిశ్చార్జి అయినవారు
803
42,909
మరణాలు
9480
చికిత్స పొందుతున్నవారు
-13,753


logo