శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 18, 2020 , 09:06:40

క‌రోనా నుంచి కోలుకున్న 1607 మంది బాధితులు

క‌రోనా నుంచి కోలుకున్న 1607 మంది బాధితులు

హైద‌రాబాద్‌: రాష్ట్రంలో మ‌రో 1607 మంది బాధితులు క‌రోనా నుంచి కోలుకున్నారు. దీంతో క‌రోనా నుంచి కోలుకున్న‌వారి సంఖ్య 2,45,293కు చేరింది. కాగా, రాష్ట్రంలో నిన్న కొత్త‌గా 948 క‌రోనా కేసులు నమోద‌వ‌డంతో మొత్తం క‌రోనా బాధితులు 2,59,776కు చేరారు. ఇందులో 13,068 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, వీరిలో 10,710 మంది బాధితులు హోం ఐసోలేష‌న్‌లో ఉన్నారు. క‌రోనా వ‌ల్ల నిన్న మ‌రో ఐదుగురు బాధితులు మ‌ర‌ణించారు. దీంతో క‌రోనాతో 1415 మంది మృతిచెందారు. కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలో 154 కేసులు ఉండ‌గా, మేడ్చ‌ల్ జిల్లాలో 83, రంగారెడ్డి జిల్లాలో 76 కేసుల చొప్పున ఉన్నాయి.