గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Sep 06, 2020 , 01:55:25

16.67 లక్షల కరోనా టెస్టులు

16.67 లక్షల కరోనా టెస్టులు

  • రికవరీ రేటు 75%, 877 మంది మృతి
  • శుక్రవారం 2,511 కేసులు నమోదు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 16.67 లక్షలకు చేరింది. శుక్రవారం 62 వేల పరీక్షలు నిర్వహించినట్టు శనివారం విడుదలచేసిన బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. మొత్తం 1,38,895 మందికి వైరస్‌ నిర్ధారణ కాగా, వీరిలో 1,04,603 (75.5%) మంది కోలుకున్నారు. 32 వేల మ ంది చికిత్స పొందుతున్నారు. 877 మంది మృతిచెందారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 1.73శాతంగా ఉంటే, తెలంగాణలో 0.63 శాతంగా ఉన్నది. రాష్ట్రంలో శుక్రవారం ఒక్కరోజే 2,511 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. జీహెచ్‌ఎంసీలో అత్యధికంగా  305 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా జయశంకర్‌ భూపాపల్లిలో 12 కేసులు వెలుగుచూశాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు
శుక్రవారం
మొత్తం
పాజిటివ్‌ కేసులు
2,511
1,38,895
డిశ్చార్జి
2,579
1,04,603
మరణాలు
11877 
చికిత్స పొందుతున్నవారు
-32,915
logo