ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Telangana - Aug 14, 2020 , 12:59:56

స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ

స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధుల పునరుద్ధరణ

హైదరాబాద్ : ఆరేండ్ల క్రితం నిలిపివేసిన ఆర్థిక సంఘం నిధులను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించడం పట్ల పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. కేంద్రానికి అనేక సార్లు సీఎం కేసిఆర్, మున్సిపల్ మంత్రి కేటీఆర్, తాను చేసిన విజ్ఞప్తుల మేరకు కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. ఈ మేరకు మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు, సీఎం కేసిఆర్, కేటీఆర్ లకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి విరాలను వెల్లడించారు. 15 వ ఆర్థిక సంఘం ఈ నిధుల కింద రాష్ట్రానికి ఈ ఏడాదికి రూ.1,847 కోట్ల నిధుల మంజూరయ్యాయని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. ఇందులో మొదటి త్రైమాసిక నిధులు రూ.308 కోట్ల విడుదల అయ్యాయని అన్నారు. ఈ నిధులను గ్రామ పంచాయతీలకు 85శాతం, మండలాలకు 10 శాతం, జెడ్పీ లకు 5శాతం నిధులను పంపిణీ చేస్తారన్నారు.

ఈ నిధులతో తాగునీటి సమస్యల నివారణ, వాన నీటి సంరక్షణ, ఇంకుడు గుంతలు, సామాజిక మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త, ప్లాస్టిక్ సేకరణ, తడి, పొడి చెత్త వేరు చేయడం, పారిశుధ్య నిర్వహణ, కంపోస్ట్ ఎరువుల తయారీ వంటి వాటికి వినియోగించాలని నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే ఆర్థిక సంఘం నిధుల పట్ల సీఎం కేసిఆర్, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. 



logo