బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 30, 2020 , 14:53:17

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మార్గదర్శకాలు విడుద‌ల‌

15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై మార్గదర్శకాలు విడుద‌ల‌

హైదరాబాద్ : 15వ ఆర్థిక సంఘం నిధుల‌ను మూడంచెల స్థానిక సంస్థలకు పంపిణీ చేయ‌డంపై సీఎం కేసీఆర్ సూచ‌న‌ల మేర‌కే కేంద్రం ఆమోదం తెలిపింద‌ని, ఆ మేర‌కు నిధుల వినియోగం కూడా జ‌రుగుతుంద‌ని పంచాయ‌తీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. స్థానిక సంస్థల శాస‌న మండ‌లి స‌భ్యుడు పోచంప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి హైద‌రాబాద్ లోని ఆయ‌న నివాసంలో క‌లిశారు. ఈ సంద‌ర్భంగా పోంచ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ రెడ్డి మంత్రికి పుష్ప గుచ్ఛం ఇచ్చి కృత‌జ్ఞతలు తెలిపారు. 

ఈ సంద‌ర్భంగా  మంత్రి మాట్లాడుతూ, 15వ ఆర్థిక సంఘం ద్వారా కేంద్రం నిధుల వినియోగం మూడంచెల పంచాయ‌తీ రాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయ‌తీల‌కు 85శాతం, మండల ప‌రిష‌త్ ల‌కు 10శాతం, జిల్లా ప‌రిష‌త్ ల‌కు 5శాతం నిధుల చొప్పున పంపిణీ చేయ‌నున్నట్లు తెలిపారు. ఈ నిధుల‌తో  గ్రామీణ వ్యవస్థ అభివృధ్ధి చెండానికి వీల‌వుతుంద‌న్నారు. ఇప్పటికే స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ప‌ల్లెం ప్రగతి, పట్టణ ప్రగతి వంటి ప‌థ‌కాల‌తోపాటు ఇత‌ర‌త్రా నిధులు దండిగా కేటాయిస్తుందన్నారు. ఎమ్మెల్సీ పోచంప‌ల్లితోపాటు, హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ కూడా ఉన్నారు.


logo