బుధవారం 27 జనవరి 2021
Telangana - Dec 28, 2020 , 06:45:31

బ్రిటన్‌ నుంచి వచ్చిన ఆ 154 మంది ఎక్కడ?

బ్రిటన్‌ నుంచి వచ్చిన ఆ 154 మంది ఎక్కడ?

హైద‌రా‌బాద్: యూకే నుంచి రాష్ట్రానికి వచ్చినవారిలో 154 మంది జాడ చిక్కడంలేదు. ఈ నెల 9 నుంచి ఇప్పటి‌వ‌రకు మొత్తం 1,216 మంది బ్రిటన్‌ నుంచి తెలం‌గా‌ణకు వచ్చారు. ఇందులో చాలా మంది ఆచూకీ లభించగా, ఇంకా 154 మంది జాడ తెలి‌య‌డం‌లేదు. యూకేలో కొత్త రకం కరోనా వైరస్‌ వెలుగు చూసిన నేప‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమ‌త్తంగా వ్యవ‌హ‌రి‌స్తు‌న్నది. వైరస్‌ వ్యాప్తి చెంద‌కుండా ఉండేం‌దుకు ట్రేసింగ్‌, టెస్టింగ్‌, ట్రీటింగ్‌ విధా‌నాన్ని అను‌స‌రి‌స్తు‌న్నది. 

యూకే నుంచి వచ్చి‌న‌వారి వివ‌రాలు సేక‌రించి, వారి ఆరోగ్య పరి‌స్థి‌తిని సమీ‌క్షి‌స్తు‌న్నది. ఇప్పటి‌వ‌రకు 970 మందిని గుర్తించి కరోనా పరీ‌క్షలు నిర్వహించారు. వీరిలో శుక్రవారం 16 మందికి, శని‌వారం ఇద్దరికి, ఆది‌వారం మేడ్చల్‌ మల్కా‌జి‌గిరి జిల్లాకు చెందిన మరో ఇద్దరికి వైరస్‌ నిర్ధా‌రణ అయి‌నట్టు వైద్యా‌రో‌గ్యశాఖ పేర్కొ‌న్నది. దీంతో వీరి సంఖ్య 20కి చేరింది. 

యూకే నుంచి వచ్చి‌న‌వా‌రిలో 92 మంది ఇతర రాష్ర్టా‌ల‌వారు కాగా, ఆ వివ‌రా‌లను ఆయా ప్రభు‌త్వా‌లకు చేర‌వే‌శారు. మిగి‌లిన 154 మంది జాడను పాస్‌‌పోర్టు ఆధా‌రంగా గుర్తిం‌చడం అధి‌కా‌రు‌లకు సవా‌ల్‌గా మారింది. పేర్కొన్న అడ్రస్‌, ఫోన్‌ నంబర్లు పాతవి కావ‌డంతో వారిని వెత‌కడం సాధ్యం కావడం లేదు. యూకే నుంచి వచ్చి‌న‌వారు లేదా యూకే మీదుగా ప్రయా‌ణించి తెలం‌గా‌ణకు చేరు‌కున్నవారు 040–24651119 నంబ‌ర్‌లో సంప్రదించా‌లని, 9154170960 నంబ‌ర్‌కు వాట్సాప్‌ చేయా‌లని అధికారులు విజ్ఞప్తి చేశారు.  


logo