ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 21:45:43

తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కొత్తగా 154 కరోనా కేసులు నమోదు

హైదరాబాద్:‌  తెలంగాణలో ఆదివారం కొత్తగా 154 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో మరో 132 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.  దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,650కి పెరిగింది. ఇవాళ కరోనాతో 14 మంది మృతిచెందారు.  తెలంగాణలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 137కు చేరింది. ప్రస్తుతం 1,771 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకూ 1,742 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. 


logo