గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 10:30:39

కరోనా నుంచి కోలుకున్న 1539 మంది

కరోనా నుంచి కోలుకున్న 1539 మంది

హైదరాబాద్‌: రాష్ట్రంలో రోజువారి కరోనా కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య మూడింతలు పెరిగింది. నిన్న కొత్తగా 502 పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో 1539 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,57,876కు చేరింది. ఇందులో 2,42,084 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కరోనా కేసుల్లో 14,385 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇందులో 11,948 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. నిన్న రాత్రి వరకు కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో కరోనా మృతుల సంఖ్య  1,407కు పెరిగింది. కాగా, రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గడంతో రికవరీ రేటు 93.87 శాతానికి పెరిగింది. మరణాల రేటు 0.54 శాతం ఉన్నది. కొత్తగా నమోదైన కేసుల్లో  జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 141 కేసులు ఉండగా, రంగారెడ్డి జిల్లాలో 72 కేసులు నమోదయ్యాయి.