వింత వ్యాధితో 1500 కోళ్లు మృత్యువాత

డిచ్పల్లి: వింత వ్యాధితో 1500 కోళ్లు మృత్యువాత పడిన ఘటన నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం యానంపల్లి తండాలో బుధవారం కలకలంరేపింది. స్థానిక దుర్గాభవాని పౌల్ట్రీ ఫామ్‌లో మంగళవారం రాత్రి దాదాపు వెయ్యికి పైగా, బుధవారం మరో 500 కోళ్లు అకస్మాత్తుగా చనిపోయాయి. పౌల్ట్రీ నిర్వాహకులు జేసీబీ సాయంతో గ్రామ శివారులో వాటిని పూడ్చి పెట్టారు. అనంతరం పశుసంవర్ధకశాఖ అధికారులకు సమాచారం అందించడంతో జాయింట్ డైరెక్టర్ డాక్టర్ భరత్, ఏడీ కిరణ్ దేశ్‌పాండే (ల్యాబ్), మండల పశువైద్యాధికారి డాక్టర్ గోపీకృష్ణ బుధవారం పౌల్ట్రీఫామ్‌కు వెళ్లి పరిశీలించారు. బతికున్న కోళ్ల నుంచి రక్తం నమూనాలను సేకరించారు. చనిపోయిన రెండు కోళ్లను పరీక్షల నిమిత్తం హైదరాబాద్ ల్యాబ్‌కు పంపించారు. కోళ్లలో బర్డ్‌ఫ్లూ లక్షణాలు కనిపించలేదని, పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు తెలుస్తాయని జేడీ భరత్ వెల్లడించారు.
తాజావార్తలు
- పిల్లల డాక్టరైనా.. విచక్షణ కోల్పోయి..
- కొవిడ్ షాక్ : పసిడి డిమాండ్ భారీ పతనం
- సెంటిమెంట్ ఫాలో అవుతున్న వరుణ్ తేజ్..!
- గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న కార్తీకదీపం ఫేమ్
- ఆరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆప్ పోటీ
- వేగంగా కొవిడ్ వ్యాక్సినేషన్ జరుపుతున్న దేశంగా భారత్
- చిల్లరిచ్చేలోపు రైలు వెళ్లిపోయింది... తరువాతేమైందంటే?..
- ఆ తీర్పు ఇచ్చింది జస్టిస్ పుష్పా వీరేంద్ర.. ఎవరామె ?
- తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
- కేంద్రమే రైతులను రెచ్చగొట్టింది : శివసేన