శుక్రవారం 15 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 11:24:53

కల్లుతాగిన 15 మందికి అస్వస్థత

కల్లుతాగిన 15 మందికి అస్వస్థత

వికారాబాద్‌: జిల్లాలో కల్లుతాగిన పలువురు అస్వస్థతకు గురయ్యారు. వికారాబాద్‌ మండలంలోని ఎర్రవల్లి, నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామాల్లో 15 మంది కల్లుతిరిగి పిడిపోయారు. దీంతో గ్రామస్తులు వారిని దవాఖానకు తరలించారు. చికిత్స అనంతరం 10 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో ఇద్దరు వికారాబాద్‌లోని దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. కృత్రిమ కల్లు తాగడం వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. విషయాన్ని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌కు సమాచారం అందించారు. దీంతో ఆయన డీఎంహెచ్‌వోతో మాట్లాడారు. ఎర్రవల్లి, చిట్టిగిద్దలో తక్షణమే వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.