శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 18, 2020 , 03:49:39

రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతం

రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతం

  • కొత్తగా 1,410 మంది డిశ్చార్జి
  • తాజా కేసులు 1,478.. ఏడుగురి మృతి
  • జీహెచ్‌ఎంసీలోనే 806 మందికి కరోనా
  • కరోనా దవాఖానల జాబితా విడుదల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం పెరుగుతున్నది. శుక్రవారం 1,410 మంది డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో రికవరీ రేటు 68 శాతంగా ఉన్నదని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇప్పటివరకు 2.37 లక్షల నమూనాలను పరీక్షించామని వివరించింది. శుక్రవారంనాటికి రాష్ట్రవ్యాప్తంగా 15,288 పడకలు ఖాళీగా ఉన్నట్టు ప్రకటించింది. తాజాగా శుక్రవారం 1,478 కేసులు వెలుగుచూశాయి. జీహెచ్‌ఎంసీలోనే 806 కేసులు నమోదైనట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది. రంగారెడ్డి జిల్లాలో 91, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 82, కరీంనగర్‌లో 77, వరంగల్‌ అర్బన్‌లో 51, పెద్దపల్లి, నల్లగొండలో 35 చొప్పున, కామారెడ్డిలో 31, రాజన్నసిరిసిల్లలో 27, మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో 23 చొప్పున, సూర్యాపేట, సంగారెడ్డిలో 20 చొప్పున, మహబూబ్‌నగర్‌లో 19, ఖమ్మంలో 18, వికారాబాద్‌లో 17, మంచిర్యాలలో 15, నారాయణపేటలో 14, యాదాద్రి భువనగిరి, కుమ్రంభీంఆసిఫాబాద్‌, నిజామాబాద్‌, మహబూబాబాద్‌లో 11 చొప్పున, జనగామలో 10, సిద్దిపేటలో 8, జగిత్యాలలో 4, జయశంకర్‌భూపాలపల్లి, వనపర్తి, జోగుళాంబ గద్వాలలో 2 చొప్పున, భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో 1 కేసు చొప్పున వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 42,496కు చేరింది. వైరస్‌తోపాటు ఇతర అనారోగ్య కారణాలతో ఏడుగురు మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 403కు పెరిగింది. 

హోంక్వారంటైన్‌లో హుస్నాబాద్‌ ఎమ్మెల్యే

హుస్నాబాద్‌ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్‌ హోంక్వారంటైన్‌లో ఉన్నారు. ఇటీవల ఎమ్మెల్యే వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా, శుక్రవారం ఫలితాల్లో పాజిటివ్‌గా తేలినట్టు సమాచారం. దీంతో ఆయన హోంక్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిసింది. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన ఓ వైద్యుడు కరోనా చికిత్సపొందుతూ గాంధీ దవాఖానలో శుక్రవారం మృతిచెందారు. ఆయనకు కిడ్నీ, కాలేయ, గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయి. 

కొవిడ్‌ చికిత్స అందజేస్తున్న 61 ప్రభుత్వ దవాఖానలు

ఆదిలాబాద్‌- రిమ్స్‌, ఉట్నూర్‌ డీహెచ్‌, ఆసిఫాబాద్‌ సీహెచ్‌సీ, కొత్తగూడెం డీహెచ్‌, భద్రాచలం ఏహెచ్‌, భూపాలపల్లి డీహెచ్‌, గద్వాల డీహెచ్‌, అలంపూర్‌ ఏహెచ్‌, జగిత్యాల ఏహెచ్‌, జనగామ డీహెచ్‌, కామారెడ్డి డీహెచ్‌, దోమకొండ ఏహెచ్‌, జుక్కల్‌ సీహెచ్‌సీ, కరీంనగర్‌ డీహెచ్‌, ఖమ్మం డీహెచ్‌, మహబూబాబాద్‌ డీహెచ్‌, గూడూర్‌ సీహెచ్‌సీ, తొర్రూర్‌ సీహెచ్‌సీ, మంచిర్యాల డీహెచ్‌, మహబూబ్‌నగర్‌ సీజీహెచ్‌, బాడేపల్లి సీహెచ్‌సీ, మెదక్‌ డీహెచ్‌, ఘట్‌కేసర్‌ సీహెచ్‌సీ, ములుగు డీహెచ్‌, ఏటూరునాగారం సీహెచ్‌సీ, నాగర్‌కర్నూల్‌ డీహెచ్‌, నల్లగొండ జీజీహెచ్‌, మిర్యాలగూడ ఏహెచ్‌, నారాయణపేట డీహెచ్‌, నిర్మల్‌ డీహెచ్‌, నిజామాబాద్‌ జీజీహెచ్‌, బోధన్‌ ఏహెచ్‌, పెద్దపల్లి డీహెచ్‌, గోదావరిఖని ఏహెచ్‌, సుల్తానాబాద్‌ సీహెచ్‌సీ, రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌ డీహెచ్‌, సంగారెడ్డి, డీహెచ్‌, జహీరాబాద్‌, సదాశివపేట సీహెచ్‌సీ, నారాయణఖేడ్‌, సీహెచ్‌సీ, పటాన్‌చెరు సీహెచ్‌సీ, సిద్దిపేట జీజీహెచ్‌, సూర్యాపేట జీజీహెచ్‌, సిరిసిల్ల డీహెచ్‌, వికారాబాద్‌ జిల్లా తాండూర్‌ డీహెచ్‌, వనపర్తి ఏహెచ్‌, వరంగల్‌ రూరల్‌ జిల్లా నర్సంపేట సీహెచ్‌సీ, భువనగరి డీహెచ్‌, చౌటుప్పల్‌ సీహెచ్‌సీ, రామన్నపేట సీహెచ్‌సీ, ఆలేరు సీహెచ్‌సీ, వరంగల్‌ ఎంజీఎం, గ్రేటర్‌ హైదరాబాద్‌లో గాంధీ దవాఖాన, గచ్చిబౌలి టిమ్స్‌, కింగ్‌ కోఠి జిల్లా దవాఖాన, ఫీవర్‌ దవాఖాన, ఛాతి దవాఖాన, ప్రభుత్వ ఆయుర్వేదిక్‌ దవాఖాన, నేచర్‌ క్యూర్‌, హోమియో, నిజామియా దవాఖాన.

చికిత్స అందిస్తున్న 57 ప్రైవేట్‌ దవాఖానలు

గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఏఐజీ, అంకుర, అపోలో, ఏస్టెర్‌ ప్రైమ్‌, అవేర్‌, బసవతారకం ఇండో అమెరికన్‌, కేర్‌, చల్మెడ, కాంటినెంటల్‌, ఫాతిమా, కామినేని, కిమ్స్‌, లిటిల్‌స్టార్‌, మెడికవర్‌, ఆలివ్‌, ఒమెగా, పేస్‌, పద్మజా, ప్రతిమ, ప్రీమియర్‌, రెయిన్‌బో, రష్‌, షెనాయ్‌, సెయింట్‌థెరిసా, సన్‌షైన్‌, తుంబే, విరించి, యశోద, జోయ్‌ దవాఖానలు వివిధ బ్రాంచుల్లో కొవిడ్‌ చికిత్స అందిస్తున్నాయి. ఇక జిల్లాల్లో కరీంనగర్‌లో మెడికవర్‌, ఖమ్మంలో న్యూలైఫ్‌ ఎమర్జెన్సీ, మేడ్చల్‌లో గ్లోబల్‌ ఐ, మలారెడ్డి, రామ్‌దేవ్‌రావ్‌, శ్రీశ్రీ హోలిస్టిక్‌, రంగారెడ్డి జిల్లాలో అపోలో, సిటిజెన్స్‌, కాంటినెంటల్‌, మెడికవర్‌, ఓజోన్‌, వరంగల్‌ అర్బన్‌లో ఆదిత్య, స్టార్‌హెల్త్‌ దవాఖానలు.
logo