గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 03:20:40

రికవరీ రేటు 88.45%

రికవరీ రేటు 88.45%

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకూ పెరుగుతున్నది. సోమవారం 88.15 శాతం రికవరీ రేటు ఉండగా, మంగళవారానికి 88.45 శాతానికి పెరిగింది. దేశంలో రికవరీ రేటు 87 శాతంగా నమోదైందని వైద్యారోగ్యశాఖ బుధవారం విడుదలచేసిన బులెటిన్‌లో పేర్కొన్నది. ఇప్పటివరకు మొత్తం 36.64 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు పూర్తిచేయగా, 2.16 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.91 లక్షల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 23,728 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్సపొందుతున్నారు. మంగళవారం 1,446 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ఒక్క జీహెచ్‌ఎంసీలోనే 252 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి జిల్లాలో 135, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 131 కేసులు వెలుగుచూశాయి.

రాష్ట్రంలో కరోనా కేసుల వివరాలు

వివరాలు     
 మంగళవారం
మొత్తం 
పాజిటివ్‌కేసులు
 1,446
2,16,238  
డిశ్చార్జి అయినవారు    
 1,918
1,91,269
మరణాలు
  08  
 1,241
చికిత్స పొందుతున్నవారు    
 -
23,728
logo