ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 20:57:43

తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 143 కరోనా కేసులు

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 143 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యియి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2842 కి చేరింది. కొత్తగా వచ్చిన కరోనా కేసులన్నీ స్థానికంగా వచ్చినవే. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3290 కు చేరింది.

కొత్తగా వచ్చిన పాజిటివ్‌ కేసుల్లో 116 జీహెచ్‌ఎమ్‌సీలోనే నమోదయ్యాయి. మిగిలిన కేసుల్లో అదిలాబాద్‌లో 2, రంగారెడ్డిలో 8, మేడ్చల్‌లో 2, సంగారెడ్డిలో 2, ఖమ్మంలో 2, మహబూబ్‌నగర్‌లో 5, వరంగల్‌లో 3, కరీంనగర్‌లో 2, మంచిర్యాలలో 1 కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో కరోనా సోకి చికిత్స తీసుకుని నయం అయిన కేసులు 1627 ఉన్నాయి. కరోనాతో పోరాడి చనిపోయిన వారి సంఖ్య 113 మంది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 1550గా ఉంది.


logo