ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 21, 2020 , 01:45:42

బీమా పరిహారం 1424 కోట్లు

బీమా పరిహారం 1424 కోట్లు

  • 28,480 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున చెల్లింపు
  • ఈ ఏడాది 548 కోట్లు.. గతేడాది 876 కోట్లు
  • రైతన్నల కుటుంబాలకు అండగా రాష్ట్ర సర్కారు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: అర్ధాంతరంగా చనిపోయిన రైతన్నల కుటుంబాలకు రాష్ట్ర సర్కారు పెద్దన్నలా నిలుస్తున్నది. అన్నదాతల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున బీమా పరిహారం అందిస్తూ అండగా నిలుస్తున్నది. ఈ రెండేండ్లలో 28,480 మంది రైతులు మృతిచెందగా వారి కుటుంబాలకు రూ.1424 కోట్లు బీమా పరిహారంగా ఇచ్చింది. 2019-2020 జూన్‌ 10 నాటికి 10,961 మంది రైతులు చనిపోగా వీరి కుటుంబాలకు మొత్తం రూ.548.05 కోట్లు అందజేసింది. ఈ ఏడాది బీమా గడువు ఆగస్టు 13తో ముగియనుంది. 2018-19లో 17,519 మంది రైతులు మరణించగా వీరి కుటుంబాలకు రూ.875.95 కోట్లు చెల్లించారు. 2018-19లో రైతు బీమా కోసం 31.27 లక్షల మంది రైతులు నమోదుచేసుకోగా వీరికి బీమా కోసం ప్రభుత్వం ఎల్‌ఐసీకి ఇన్సూరెన్స్‌ ప్రీమియంగా రూ.710.58 కోట్లు చెల్లించింది. ఈ ఏడాది 32.16 లక్షల మంది రైతులు నమోదుచేసుకోగా రూ.1065.37 కోట్ల ప్రీమియం కట్టింది.

వివరాలు
2018-19
2019-20
నమోదైన రైతులు
31.27 లక్షలు
32.16 లక్షలు
మృతి చెందిన వారు
17519
10961
బీమా పరిహారం
875.95 కోట్లు
548.05 కోట్లు


logo