ఆరేండ్లలో 14వేల పరిశ్రమలు

పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడంలో టీఎస్-ఐపాస్ సరికొత్త విప్లవాన్ని సృష్టిస్తున్నది. గడచిన ఆరేండ్లలో 14వేల పైచిలుకు పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయడం స్వరాష్ట్రంలోనే కాదు.. ఉమ్మడిరాష్ట్రంలోనే ఆల్‌టైమ్ రికార్డు కావడం గమనార్హం. సుస్థిరప్రభుత్వం, సమర్థ నాయకత్వంతోపాటు టీఎస్-ఐపాస్ విధానాలుదేశవిదేశా ల్లోని పారిశ్రామికవేత్త లను ఆకర్షిస్తున్నాయి. టీఎస్-ఐపాస్ ప్రారంభించిన తర్వాత పరిశ్రమల అనుమతులు ఊపందుకోవడమే ఇందుకు నిదర్శనం. 14 వేల పరిశ్రమల్లో ఇప్పటికే 11వేల సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇప్పటికే రెండు లక్షల కోట్ల వరకు పెట్టుబడులు రాగా, 14.61లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
టీఎస్ఐపాస్ ఆల్‌టైమ్ రికార్డు
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలు స్థాపించేవారు అనుమతుల కోసం ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం 2015లో తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్(టీఎస్-ఐపాస్) సింగిల్‌విండో విధానం అమల్లోకి తెచ్చింది. గతంలో అనుమతులకు తీవ్ర ఇబ్బందులు, మితిమీరిన జాప్యం ఉండగా, పూర్తిగా ఆన్లైన్ విధానమైన టీఎస్-ఐపాస్‌తో ఎటువంటి సమస్యలు లేకుండా అనుమతులు మంజూరవుతున్నాయి. దీని ద్వారా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 వరకు మొత్తం 12021పరిశ్రమలకు మంజూరు లభించగా, వీటి ద్వారా 13,90,361మందికి ఉపాధి లభించే అవకాశం ఏర్పడింది. టీఎస్-ఐపాస్‌కు ముందు, అంటే 2014-15లో కేవలం 174 పరిశ్రమలకు మాత్రమే అనుమతులు మంజూరు కాగా, వాటితో 5,051మందికి ఉపాధి లభించింది.
అనుమతికి గరిష్ఠంగా 30రోజులు
టీఎస్-ఐపాస్‌తో మొత్తం 27 ప్రభుత్వ శాఖల పరిధిలోని 38రకాల సేవలు సింగిల్ విండో విధానంలో లభిస్తుండటంతో అనుమతుల్లో వేగం పెరిగింది. అనుమతుల ఫీజులు సైతం డీడీ, లేక చలాన్‌తో ఆన్లైన్లోనే చెల్లించే వీలున్నది. ఫైళ్ల పరిష్కారంలోనూ మనుషుల ప్రమేయం తగ్గిపోవడంతో అనుమతుల్లో జాప్యం లేకుండా పోయింది. రూ.200కోట్లకన్నా ఎక్కువ పెట్టుబడి, 1000మంది వరకూ ఉపాధి కల్పించే సంస్థలకు పారిశ్రామికవేత్త స్వీయ ధ్రువీకరణ తీసుకుని 15రోజుల్లోగా అనుమతులు మంజూరు చేస్తుండటం పరిశ్రమల స్థాపనకు ఊతమిచ్చింది.
ఈఓడీబీలో అత్యుత్తమ స్థానం
టీఎస్-ఐపాస్ విధానం అత్యంత పారదర్శకంగా ఉండటంతో కేంద్రం ప్రపంచ బ్యాంకు సమన్వయంతో రాష్ర్టానికి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈఓడీబీ)లో అత్యుత్తమ ర్యాంకును అందించింది. ఆన్లైన్లో అనుమతుల మంజూరుతోపాటు దరఖాస్తుదారుడి మొబైల్ నంబరు, ఈ-మెయిల్‌కు పురోగతి సమాచారాన్ని ఇస్తుండటం విశేషం. ఫలితం గా దరఖాస్తుదారు తన దరఖాస్తు పురోగతిని తెలుసుకునేందుకు సులువవుతున్నది. రాష్ట్రం లో పరిశ్రమల స్థాపన మరింత వేగవంతం అయ్యేందుకు మంత్రి కేటీఆర్ కృషితో టీఎస్-ఐపాస్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
అనుమతులకు గడువు
కనిష్ఠం 7 రోజులు
గరిష్ఠం 30 రోజులు
ఆలస్యమైతే.. అధికారికి విధించే జరిమానా
రోజుకు రూ.1000
టీఎస్-ఐపాస్ అనుమతుల వివరాలు
సం. యూనిట్లు పెట్టుబడులు ఉపాధి
(రూ.కోట్లలో)
2014-15 174 1,806 5,051
2015-16 1,536 28,990 94,454
2016-17 1,710 34,484 98,794
2017-18 2,810 57,422 2,74,230
2018-19 2,820 34,830 6,04,669
2019-20 3,084 40,521 3,16,334
2020-21 2,301 10,896 68,338
మొత్తం 14,435 2,08,949 14,61,870
తాజావార్తలు
- శర్వానంద్ 'శ్రీకారం' రిలీజ్ డేట్ ఫిక్స్
- గణతంత్ర వేడుకల్లో బ్రహ్మోస్ క్షిపణుల ప్రదర్శన
- ఏజ్ గ్యాప్‌పై నోరు విప్పిన బాలీవుడ్ నటి
- ఎవరిని వదిలేది లేదంటున్న డేవిడ్ వార్నర్
- 15 నిమిషాల్లో దోపిడీ చేసి.. 15 గంటల్లో పట్టుబడ్డారు
- అంటార్కిటికా దీవుల్లో భూకంపం..
- డ్రైవరన్నా.. సలాం!
- ఓటీటీలో అడుగుపెట్టబోతున్న మాస్టర్
- ఎర్రలైటు పడితే ఆగాలి.. గ్రీన్ పడ్డాకే కదలాలి
- కోపంతో కాదు ప్రేమతోనే..